![]() |
![]() |
.webp)
ఈ వారం సూపర్ సింగర్స్ షో దుమ్ము రేపబోతోంది..ఈ నేపథ్యంలో వచ్చే వారం ప్రసారం కాబోయే సూపర్ సింగర్ ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది.. మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఇక ఈ ప్రోమోలో హోస్ట్ శ్రీముఖి చేసిన హంగామా మాములుగా లేదు .."అందరూ జోడీలుగా వచ్చారు నేనే సింగల్ గా వచ్చాను" అని చెప్తూ చాలా ఫీలయ్యింది. ఇక శ్రీముఖికి నేనున్నానంటూ మ్యూజిక్ ట్రూప్ లో ఉన్న లీడ్ మ్యుజీషియన్ వచ్చి "నీకు నే జోడి" అని వచ్చి శ్రీముఖి పక్కన నిలబడి కాసేపు డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసారు.. ఆ తరువాత కంటెస్టెంట్స్ వచ్చి మంచిమంచి హిట్ సాంగ్స్ పాడి వినిపించారు.. ఈవారం డ్యూయెట్ రౌండ్ ఇచ్చింది శ్రీముఖి. కాబట్టి కంటెస్టెంట్స్ అంత కూడా జోడిగా మంచి హిట్ సాంగ్స్ ని ఆలపించి జడ్జెస్ ని మెప్పించారు. ఆ తరువాత శ్రీముఖి మధ్యలో ఒక టాస్క్ ఇచ్చింది.
ఇటు శ్రీముఖి లేడీ కంటెస్టెంట్స్ తో నిలబడి ఉండగా మేల్ కంటెస్టెంట్స్ ముగ్గురు వచ్చి వాళ్ళను టీజ్ చేసారు. అందులో సుమనస్ అనే కంటెస్టెంట్ "మీరు ఒకే అంటే" అని ఇంకేదో అడిగేసరికి ఇక జడ్జి రాహుల్ సిప్లిగంజ్ ఒక ఘాటైన కామెంట్ ఇచ్చాడు. "అదేందిరా నాయనా..నిన్ను కొడతార్రా సుమనస్ బయటకు వెళ్తే" అన్నాడు. ఇక ప్రోమో ఫైనల్ లో సుమనస్ వచ్చి నరసింహ అనే మూవీ నుంచి " శృంగర వీర" అనే సాంగ్ పాడి అందరినీ అలరించాడు. అతని సాంగ్ కి జడ్జెస్, కంటెస్టెంట్స్ అంతా లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. "1999 లో నరసింహ మూవీ రిలీజయిన టైంలో నేను పుట్టాను. మా అమ్మకు ఈ పాట చాలా ఫేవరేట్. అలా మా అమ్మ చిన్నప్పటి నుంచి తాను పాడుకుంటూ నాతో పాడిస్తూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ గ్రాండ్ స్టేజి మీద అమ్మ ముందు ఆమెకు నచ్చిన సాంగ్ పాడడం చాలా సంతోషంగా అనిపిస్తోంది." అని చెప్పాడు సుమనస్. తరువాత సుమనస్ మదర్ ని కూడా స్టేజి పైకి పిలిచారు.. "ఈ పాటను వాడి నోటి నుంచి వినాలని కొన్నేళ్లుగా కలలుగంటున్నాను.. అది ఇవ్వాళ నెరవేరినందుకు చాలా చాలా ధన్యవాదాలు" అని చెప్పి ఆమె కూడా అదే పాటను పాడి వినిపించారు. ఆమె పాడిన ఆ పాటకు జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు.
![]() |
![]() |